French Open: జకోనా మజాకా
close

ప్రధానాంశాలు

Updated : 14/06/2021 07:33 IST

French Open: జకోనా మజాకా

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నొవాక్‌ సొంతం
తొలి రెండు సెట్లు ఓడినా టైటిల్‌ కైవసం
ఫైనల్లో సిట్సిపాస్‌పై గెలుపు
పారిస్‌

తొలి రెండు సెట్లు పోయాయ్‌ ఇంకేం గెలుస్తాడులే అనే ఆలోచనలు! సిట్సిపాస్‌దే టైటిల్‌ అనే అంచనాలు! తర్వాత సెట్లోనే మ్యాచ్‌ అయిపోతుందేమో అన్ తలపులు! కానీ బరిలో ఉంది జకోవిచ్‌! ఎన్ని చూసుంటాడు.. ఎన్ని ఆడుంటాడు! ఒక్క అవకాశం...! అన్నట్లుగా కనిపించిన ఈ సెర్బియా యోధుడు ఆ ఛాన్స్‌ దొరకగానే చెలరేగిపోయాడు.. పాయింట్‌ పాయింట్‌కు బలాన్ని పెంచుకుంటూ.. ప్రత్యర్థిని బలహీనుడిగా మారుస్తూ కప్‌  ఎగరేసుకుపోయాడు! ఫ్రెంచ్‌ కోటలో మరోసారి తన జెండాను పాతేశాడు! టైటిల్‌ నం.19 సాధించేశాడు! కెరీర్‌లో అతడికిది రెండో ఫ్రెంచ్‌ ఓపెన్‌. 2016లో అతడు తొలిసారి ఈ టైటిల్‌ గెలిచాడు.
జకో అదరహో! ఏమా ఆట.. ఏమా పోరాటం! ఓటమి తప్పదా   అన్న స్థితి నుంచి అసాధారణంగా పుంజుకున్న ఈ సెర్బియా స్టార్‌ ఫ్రెంచ్‌ ఓపెన్లో విజయకేతనం ఎగురవేశాడు. ఆదివారం నాలుగు  గంటలకు పైగా నువ్వానేనా అన్నట్లు సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ 6-7 (6/8), 2-6, 6-3, 6-2, 6-4తో అయిదో సీడ్‌ స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ను ఓడించాడు. తొలిసారి ఫైనల్‌కు వచ్చిన స్టెఫానోస్‌కు గట్టిగానే పోరాడినా నిరాశ తప్పలేదు.

 

1
ఓపెన్‌ శకంలో అన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు రెండేసిసార్లు గెలిచిన తొలి ఆటగాడిగా జకోవిచ్‌ ఘనత సాధించాడు.

2
అత్యధిక సింగిల్స్‌ ట్రోఫీల జాబితాలో జకోది రెండోస్థానం. ఫెదరర్‌, నాదల్‌ (20 టైటిళ్లు) ముందున్నారు.


సిట్సిపాస్‌ దూకుడు: తొలి గేమ్‌లోనే రెండు బ్రేక్‌ పాయింట్లు కాచుకుని గేమ్‌ దక్కించుకున్న సిట్సిపాస్‌ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. డ్రాప్‌ షాట్లు.. బలమైన ఫోర్‌ హ్యాండ్‌ విన్నర్లతో తొలి సెట్‌లో 5-4తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ స్థితిలో స్టెఫానోస్‌ సులభంగా సెట్‌ గెలిచేలా కనిపించాడు. కానీ జకో పోరాటం వదల్లేదు. ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి స్కోరు సమం చేసిన అతడు ఆపై సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించాడు.  టైబ్రేకర్‌లో 0-4తో వెనకబడినా పుంజుకున్న జకో 6-6తో స్కోరు సమం చేశాడు. కానీ మెరుపు ఫోర్‌ హ్యాండ్‌ విన్నర్లతో వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన సిట్సిపాస్‌ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో తొలి, ఏడో గేమ్‌లలో బ్రేక్‌ సాధించిన సిట్సిపాస్‌ అదే ఊపులో సెట్‌ దక్కించుకుని ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకున్నాడు.

ఆ మూడు సెట్లలో..: రెండు సెట్లు పోయినా జకోవిచ్‌ తన శైలిలో పుంజుకున్నాడు. ఒకవైపు నుంచి సిట్సిపాస్‌ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నా.. తన క్లాస్‌ ఆటను బయటకు తీశాడీ సెర్బియో యోధుడు. సుదీర్ఘ ర్యాలీలతో ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి పాయింట్లు సాధించిన జకో.. నెమ్మదిగా గేర్లు మార్చాడు. మెరుపు క్రాస్‌ కోర్టు రిటర్న్‌లు, డ్రాప్‌ షాట్లు ఒకటేమిటి తన అస్త్రాలన్నిటినీ ప్రయోగించాడు. నాలుగో గేమ్‌లో సిట్సిపాస్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నొవాక్‌ అదే జోరులో 6-2తో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. ఇక నాలుగో సెట్లో జకో విశ్వరూపమే చూపించాడు. స్టెఫానోస్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వరుసగా నాలుగు గేమ్‌లు సొంతం చేసుకుని 4-0తో ఆధిక్యంలో నిలిచాడు. నొవాక్‌ జోరుతో ఢీలాపడ్డ సిట్సిపాస్‌ పదే పదే అనవసర తప్పిదాలు చేసి పాయింట్లు సమర్పించుకున్నాడు. అదే జోరుతో సెట్‌ను గెలుచుకున్న ఈ ప్రపంచ నంబర్‌వన్‌.. మ్యాచ్‌ను ఫైనల్‌ సెట్‌కు తీసుకెళ్లాడు. అయిదో సెట్లో సిట్సిపాస్‌ నుంచి ప్రతిఘటన ఎదురు కావడంతో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. మూడో గేమ్‌లో అయితే డ్యూస్‌ దగ్గరే చాలాసేపు మ్యాచ్‌ సాగింది. ఈ గేమ్‌ను బ్రేక్‌ చేసి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లిన జకో ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. సిట్సిపాస్‌ నుంచి ప్రతిఘటన ఎదురైనా నిలబడిన నొవాక్‌.. పదో గేమ్‌లో సర్వీస్‌ నిలబెట్టుకుని విజయనాదం చేశాడు.   ఈ పోరులో జకో 5 ఏస్‌లతో పాటు 56 విన్నర్లు కొట్టాడు.
క్రెజికోవా ఆనందం ‘డబుల్‌’: బార్బరా క్రెజికోవా ఆనందం రెట్టింపైంది. ఫ్రెంచ్‌ ఓపెన్లో ఇప్పటికే మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన ఈ చెక్‌ రిపబ్లిక్‌ అమ్మాయి.. డబుల్స్‌లోనూ విజేతగా నిలిచి అరుదైన ‘డబుల్‌’ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్‌ క్రెజికోవా-సినియాకోవా జంట 6-4, 6-1తో పద్నాలుగో సీడ్‌ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌)-బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) జోడీని ఓడించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన