కొట్టేస్తుందా కోహ్లీసేన
close

ప్రధానాంశాలు

Updated : 18/06/2021 02:15 IST

కొట్టేస్తుందా కోహ్లీసేన

నేటి నుంచే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌
న్యూజిలాండ్‌తో భారత్‌ ఢీ
మధ్యాహ్నం 3 గంటల నుంచి..
సౌథాంప్టన్‌

దాదాపు రెండేళ్ల ప్రయాణం.. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు.. ఎన్నో అపురూప విజయాలు.. మధ్యలో కరోనా విసిరిన సవాళ్లు..! ఎట్టకేలకు కోహ్లీసేన ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశాన్ని వన్డేల్లోనూ, టీ20ల్లోనూ జగజ్జేతగా నిలిపిన టీమ్‌ఇండియా.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ కోట్ల అభిమానుల ఆశలను నెరవేర్చేందుకు బరిలోకి దిగనుంది. మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేటి నుంచే. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న భారత్‌ టైటిల్‌ కోసం.. అంతే బలంగా ఉన్న న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. సౌథాంప్టన్‌లో రసవత్తర సమరం ఖాయం. ర్యాంకింగ్స్‌లో కివీస్‌ది అగ్రస్థానమైతే.. ఆ వెనుకే భారత్‌. ఇటు బ్యాటింగ్‌లో.. అటు బౌలింగ్‌లో రెండూ రెండే. సమవుజ్జీల పోరులో అభిమానులకు పుష్కల వినోదం పక్కా.

మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో ఆఖరి సమరానికి వేళైంది. టైటిల్‌ను దక్కించుకోవాలని తహతహలాడుతున్న టీమ్‌ండియా.. శుక్రవారం ఆరంభమయ్యే ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. సౌథాంప్టన్‌(ఇంగ్లాండ్‌)లోని ఏజీస్‌ బౌల్‌ స్టేడియం మ్యాచ్‌కు వేదిక. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌కు గెలిచేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. సత్తా మేర ఆడితే ట్రోఫీని ముద్దాడడం కష్టమే మీ కాదు. కానీ మరోవైపు ప్రత్యర్థి కూడా తక్కువదేమీ కాదు. కివీస్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కెప్టెన్‌ విలియమ్సన్‌ నాయకత్వంలోని ఆ జట్టు సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ను గెలిచిన ఉత్సాహంతో పోరుకు సిద్ధమైంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించిన టీమ్‌ఇండియా.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగనుంది.

భారత్‌ ఉత్సాహంగా..

బలమైన బ్యాటింగ్‌.. భయపెట్టే బౌలింగ్‌.. అదరగొట్టే ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా ఉన్న భారత్‌ టైటిల్‌పై కన్నేసింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఆస్ట్రేలియా (2020-21)లో సాధించిన చారిత్రక విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న మన ఆటగాళ్లు ఫైనల్‌ పోరుకు సై అంటున్నారు. ఇప్పటివరకూ ప్రపంచకప్‌లలో జట్టును విజేతగా నిలపలేకపోయిన కెప్టెన్‌ కోహ్లి.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను దేశానికి అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. సారథిగా తనదైన దూకుడుతో సహచరుల్లో స్ఫూర్తి నింపి.. అత్యుత్తమ ప్రదర్శన రాబట్టే అతడు కివీస్‌ సవాలును అధిగమించగలమన్న ధీమాతో పోరుకు సిద్ధమయ్యాడు. బ్యాట్స్‌మన్‌గానూ జట్టుకు అతడెంతో కీలకం. రోహిత్‌ శర్మ, పుజారా లాంటి ఆటగాళ్లతో టాప్‌ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. భారత్‌ పైచేయి సాధించాలంటే.. యువ ఓపెనర్‌ గిల్‌తో కలిసి రోహిత్‌ ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీయాలి. ఇక వికెట్లకు, బౌలర్లకు మధ్య గోడలా నిలబడే పుజారా మరోసారి తనదైన ఆటతీరుతో క్రీజులో పాతుకుపోవాలి. డబ్ల్యూటీసీలో భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న రహానె కూడా మంచి లయతోనే ఉన్నాడు. పంత్‌, జడేజా జట్టు బ్యాటింగ్‌కు అదనపు బలాన్నిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో గొప్ప రికార్డు ఉన్న పంత్‌పై అందరి కళ్లూ ఉంటాయనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల్లో టెస్టు శతకాలు సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా నిలిచిన అతను.. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అదే దూకుడు కొనసాగిస్తాడని జట్టు ఆశిస్తోంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి చారిత్రక విజయంలో కీలకంగా వ్యవహరించిన పంత్‌.. ఈ మ్యాచ్‌లోనూ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. మరోవైపు కొన్నేళ్ల నుంచి క్రమంగా మెరుగువుతున్న జడేజా బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. అతనితో పాటు అశ్విన్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించగల సమర్థుడే. కాబట్టి జట్టు ఆరుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌తోనే ఆడనుంది. ఇక కొన్నేళ్లుగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న మన పేస్‌ దళం విదేశాల్లో జట్టుకు విజయాలు అందిస్తూనే ఉంది. ఈ కీలక డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు పేసర్లు.. బుమ్రా, షమి, ఇషాంత్‌ సన్నద్ధమయ్యారు. సిరాజ్‌ ఫామ్‌లోనే ఉన్నా తుదిజట్టులో స్థానం దక్కలేదు. అనుభవజ్ఞుడైన ఇషాంత్‌వైపే జట్టు మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపింది. మరోవైపు సీనియర్‌ స్పిన్‌ ద్వయం.. అశ్విన్‌, జడేజా ప్రత్యర్థిని ఎలా దెబ్బతీస్తారో చూడాలి. కివీస్‌ ప్రధాన ఆటగాళ్లయిన విలియమ్సన్‌, టేలర్‌, లేథమ్‌పై అశ్విన్‌కు మంచి రికార్డు ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం.

ప్రత్యర్థి పటిష్టంగా

న్యూజిలాండ్‌ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టుతో చేరిన కెప్టెన్‌ విలియమ్సన్‌తో పాటు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌, లేథమ్‌, కాన్వే, నికోల్స్‌, వాట్లింగ్‌ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న విలియమ్సన్‌ పరుగుల ఆకలి కొనసాగుతూనే ఉంది. అతణ్ని త్వరగా పెవిలియన్‌ చేర్చకపోతే భారత్‌కు ప్రమాదం తప్పదు. మరోవైపు ఎంతో అనుభవంతో పాటు ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు ఉన్న టేలర్‌ భారత్‌పై సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక అరంగేట్రంలోనే అదరగొట్టిన కాన్వేతో పాటు మరో ఓపెనర్‌ లేథమ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లోనూ ఆ జట్టుకు తిరుగులేదు. అగ్రశ్రేణి పేస్‌ ద్వయం.. సౌథీ, బౌల్ట్‌ జోరు మీద ఉండడం జట్టుకు లాభించే అంశం. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రాణించిన ఈ సీనియర్‌ పేసర్లు.. భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు. వీళ్లతో పాటు పొడగరి పేసర్‌ జేమీసన్‌, నీల్‌ వాగ్నర్‌, మ్యాట్‌ హెన్రీ దూకుడు మీదున్నారు.  

పిచ్‌ ఎలా ఉందంటే..
ఫైనల్‌ జరిగే ఏజీస్‌ బౌల్‌ స్టేడియంలో పచ్చికతో నిండిన పిచ్‌ జట్లకు స్వాగతం పలకనుంది. ఇది పేస్‌, స్వింగ్‌, బౌన్స్‌కు అనుకూలంగా ఉండి పేసర్లకు గొప్పగా సహకరించే అవకాశముంది. పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టనుంది. మ్యాచ్‌ జరిగే రోజుల్లో వర్షం పడే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎండ కాస్తే మ్యాచ్‌ సాగుతున్నా కొద్దీ పిచ్‌ పగుళ్లు వచ్చి.. స్పిన్నర్లకు సహకరించే అవకాశముంది.
తుది జట్లు:

భారత్‌: రోహిత్‌, గిల్‌, పుజారా, కోహ్లి, రహానె, పంత్‌, జడేజా, అశ్విన్‌, షమి, బుమ్రా, ఇషాంత్‌

న్యూజిలాండ్‌ (అంచనా): కాన్వే, లేథమ్‌, విలియమ్సన్‌, టేలర్‌, నికోల్స్‌, వాట్లింగ్‌, జేమీసన్‌, సౌథీ, బౌల్ట్‌, వాగ్నర్‌, అజాజ్‌

వాతావరణంలో మార్పులు మా తుది జట్టుపై ఎలాంటి ప్రభావం చూపవు. అటు బ్యాటింగ్‌లో లోతు.. ఇటు బౌలింగ్‌లో ప్రత్యామ్నాయాలు ఉండేలా ఒక బలమైన జట్టును బరిలో దించడం మా ఉద్దేశం. మేం మైదానంలో ఏం చేయాలన్న విషయంపై స్పష్టత ఉంది. వాతావరణం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. మరీ ఎక్కువ ఆలోచించట్లేదు.’’

- కోహ్లి

రిజర్వ్‌డే..

ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం రిజర్వ్‌ డేను కేటాయించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా అయిదు రోజుల మ్యాచ్‌లో కోల్పోయిన ఆటను ఆరో రోజు నిర్వహిస్తారు. ఫలితం తేలే అవకాశం ఉందని భావిస్తేనే రిజర్వ్‌ డేను అమలు చేస్తారు.

12

ఫైనల్‌ చేరే క్రమంలో మొత్తం ఆరు సిరీస్‌ల్లో 17 మ్యాచ్‌లాడిన భారత జట్టు సాధించిన విజయాలు. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ఈ జట్టు.. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మొత్తం 520 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.  

1095

డబ్ల్యూటీసీలో 17 మ్యాచ్‌ల్లో రహానె చేసిన పరుగులు. భారత్‌ తరపున  ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు అతడే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన