సవాలుకు నిలిచారు
close

ప్రధానాంశాలు

Updated : 20/06/2021 05:15 IST

సవాలుకు నిలిచారు

భారత్‌ 146/3
కివీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌

సౌథాంప్టన్‌లో టీమ్‌ఇండియాకు సానుకూల ఆరంభం. ప్రతికూల పరిస్థితుల్లో కోహ్లీసేన అచ్చమైన టెస్టు బ్యాటింగ్‌ను చూపించింది. పరిస్థితులకు తనకు తాను గొప్పగా అన్వయించుకుంటూ పదునైన కివీస్‌ పేస్‌కు  ఎదురొడ్డి.. మెరుగైన స్కోరుకు బాటలు వేసుకుంది. న్యూజిలాండేమీ వెనుకబడలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల వేగానికి కళ్లెం వేసిన ఆ జట్టు.. మూడు కీలక వికెట్లు చేజిక్కించుకుంది. మొత్తం మీద మేటి జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆసక్తికరంగానే మొదలైంది. రెండు జట్లూ గట్టిగానే పోటీలో ఉన్నాయి. మూడో రోజు ఆటే మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించవచ్చు. కానీ వాతావరణం ఆటకు సహకరిస్తుందా అన్నదే ప్రశ్న! వెలుతురులేమి  కారణంగా రెండో రోజు చాలా ఓవర్ల ఆట జరగలేదు.

భారత స్ప్రింట్‌ దిగ్గజం మిల్కా సింగ్‌కు నివాళిగా న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరులో టీమ్‌ఇండియా ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి బరిలో దిగారు.

సౌథాంప్టన్‌

మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను భారత జట్టు ఆశావహంగా ఆరంభించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (44 బ్యాటింగ్‌; 124 బంతుల్లో 1×4) పట్టుదలగా నిలవడంతో రెండో రోజు, శనివారం వెలుతురులేమి కారణంగా ఆట త్వరగా ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సవాలు విసిరే పరిస్థితుల్లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (34; 68 బంతుల్లో 6×4), శుభ్‌మన్‌ గిల్‌ (28; 64 బంతుల్లో 3×4) ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. కోహ్లి, రహానె (29 బ్యాటింగ్‌; 79 బంతుల్లో 4×4) క్రీజులో ఉన్నారు. ఈ పిచ్‌పై 250-300 కూడా మంచి స్కోరే అని భావిస్తున్నారు.
రోహిత్‌, గిల్‌ సహనంతో..: 62.. తొలి వికెట్‌కు రోహిత్‌, శుభ్‌మన్‌ జోడించిన పరుగులు. పరీక్షించే పరిస్థితుల్లో భారత్‌కు ఇది చాలా మంచి ఆరంభమే. వర్షం కారణంగా మొదటి రోజు ఆట తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు చల్లని, ముబ్బులు పట్టిన వాతావరణంలో న్యూజిలాండ్‌ సారథి విలియమ్సన్‌ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. టీమ్‌ఇండియా రెండు రోజుల ముందు ప్రకటించిన తుది జట్టుకే కట్టుబడి ఉండగా.. కివీస్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ను కాదనుకుని నలుగురు ప్రధాన పేసర్లతో దాడికి దిగింది. కొలిన్‌ గ్రాండ్‌హోమ్‌ అయిదో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం. న్యూజిలాండ్‌ పూర్తి పేస్‌ బలాన్ని మోహరించగా... రోహిత్‌, గిల్‌ స్పష్టమైన వ్యూహంతో క్రీజులో అడుగుపెట్టారు. పరిస్థితులకు అన్వయించుకుంటూ ప్రమాదకర కొత్త బంతి జోడీ బౌల్ట్‌, సౌథీలను సమర్థంగా ఎదుర్కొన్నారు. స్వింగ్‌కు నిలిచారు. ఎడమచేతి వాటం పేసర్‌ బౌల్ట్‌ ఇన్‌స్వింగర్‌ ఎదుర్కొనేందుకు రోహిత్‌ ఓపెన్‌ స్టాన్స్‌తో బ్యాటింగ్‌ చేయగా.. సౌథీ ఔట్‌స్వింగర్‌ను ఆడేందుకు గిల్‌ క్రీజు బయట నిలబడ్డాడు. తన అరంగేట్ర సిరీస్‌లో ఆస్ట్రేలియాలో షార్ట్‌ బంతులను అలవోకగా ఎదుర్కొని ఆకట్టుకున్న  గిల్‌.. ఫ్రంట్‌ ఫుట్‌పై బౌల్ట్‌ బంతిని పుల్‌ చేయడం ద్వారా ఫైనల్లో  భారత్‌కు తొలి బౌండరీని అందించాడు. తర్వాతి ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో రోహిత్‌ పాయింట్‌, గల్లీ మీదుగా ఫోర్లు కొట్టేశాడు. ఇక 11వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన జేమీసన్‌కు గిల్‌ బౌండరీతో స్వాగతం పలికాడు. ఇన్‌స్వింగర్‌ను చూడముచ్చటైన స్ట్రెయిట్‌ డ్రైవ్‌తో బౌండరీకి తరలించాడు. తొలి 11 ఓవర్లలో ఒక్క మెయిడెనూ పడలేదు. కానీ తర్వాత మూడు ఓవర్లలో ఒక్క పరుగూ రాలేదు. అయితే జేమీసన్‌ పదునైన బౌన్సర్‌ గిల్‌  హెల్మెట్‌కు బలంగా తాకింది. అతడే భారత్‌ను తొలి దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతున్న దశలో జేమీసన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ మూడో స్లిప్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్‌ ఎంతోసేపు నిలువలేదు. వాగ్నర్‌ తన తొలి ఓవర్లోనే అతణ్ని ఔట్‌ చేశాడు. లంచ్‌కు స్కోరు 69/2.
కోహ్లి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌: లంచ్‌కు కాసేపు ముందు చకచకా రెండు వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చిన కివీస్‌.. లంచ్‌ తర్వాత కూడా తన పేస్‌తో ఒత్తిడిని కొనసాగించింది. పట్టుదలగా నిలిచిన కోహ్లి, పుజారా వెంటనే మరో వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. కానీ ఇద్దరూ ఆచితూచి ఆడడంతో పరుగులు ఎక్కువగా రాలేదు. 36వ బంతికి కానీ ఖాతా తెరవని పుజారా.. ప్రత్యర్థి బౌలర్లను విసిగించి బౌల్ట్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 88. తొలి 20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 62 పరుగులు చేసిన భారత్‌.. తర్వాతి 21 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులే సాధించడం గమనార్హం. అయితే కోహ్లి.. రహానేతో కలిసి కివీస్‌ పేస్‌ పరీక్షను తట్టుకుంటూ సింగిల్స్‌ తీస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలినప్పటికీ.. ఇన్నింగ్స్‌ను చుట్టేసి ప్రయత్నం చేసిన కివీస్‌ బౌలర్లకు ఈ జంట చెక్‌ పెట్టింది. వీరు అభేద్యమైన నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) సౌథీ (బి) జేమీసన్‌ 34; శుభ్‌మన్‌ గిల్‌ (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 28; పుజారా ఎల్బీ (భి) బౌల్ట్‌ 8; కోహ్లి బ్యాటింగ్‌ 44; రహానె బ్యాటింగ్‌ 29; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (64.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146
వికెట్ల పతనం: 1-62, 2-63, 3-88
బౌలింగ్‌: సౌథీ 17-4-47-0; బౌల్ట్‌ 12.4-2-32-1; జేమీసన్‌ 14-9-14-1; గ్రాండ్‌హోమ్‌ 11-6-23-0; నీల్‌ వాగ్నర్‌ 10-3-28-1

 

త్యుత్తమ ప్రదర్శన లక్ష్యం దిశగా మొత్తం దేశానికే స్ఫూర్తిగా నిలిచిన వారసత్వం మీది. ఎప్పటికీ వెనక్కి తగ్గకుండా, కలలను అందుకోవాలని చాటారు. మిల్కా సింగ్‌ జీ మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరెప్పటికీ గుర్తుండిపోతారు.

- విరాట్‌ కోహ్లి
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన