గట్టెక్కించారు
close

ప్రధానాంశాలు

Updated : 20/06/2021 04:57 IST

గట్టెక్కించారు

స్నేహ్‌, తానియా అద్భుత పోరాటం
భారత్‌-ఇంగ్లాండ్‌ ఏకైక టెస్టు డ్రా

ఏడేళ్ల తర్వాత ఆడుతున్న తొలి టెస్టు.. జట్టులో సగం మంది కొత్త ముఖాలే..! విదేశీ వాతావరణం.. అనుభవం లేని పిచ్‌! అయినా మిథాలీ సేన గొప్పగా ఆడింది... ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టును అద్భుతంగా పోరాడి డ్రా చేసుకుంది. ఫాలోఆన్‌ ఆడుతూ ఒక దశలో ఓటమి దిశగా నడిచినా.. అసాధారణ బ్యాటింగ్‌తో అడ్డుకున్న స్నేహ్‌-తానియా టీమ్‌ఇండియాకు పరాజయాన్ని తప్పించారు.

బ్రిస్టల్‌

ఇంగ్లాండ్‌ మహిళలతో ఏకైక టెస్టు.. భారత రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే 8 వికెట్లు పడిపోయాయి... కీలక బ్యాటర్లంతా పెవిలియన్‌ చేరారు.. ఓటమి తప్పదేమో అనిపించింది! కానీ ఎనిమిదో స్థానంలో వచ్చిన స్నేహ్‌ రాణా (80 నాటౌట్‌; 154 బంతుల్లో 13×4), పదో నంబర్‌ బ్యాటర్‌ తానియా భాటియా (44 నాటౌట్‌; 88 బంతుల్లో 6×4)తో కలిసి అసాధారణంగా పోరాడింది. ఒకవైపు ఓవర్లు కరిగిస్తూనే పరుగులు రాబట్టిన ఈ జోడీ భారత్‌ను ఓటమి నుంచి బయటపడేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్లూ నిర్ణీత ఓవర్ల కంటే ముందే డ్రాకు అంగీకరించాయి. అప్పటికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 344/8తో నిలిచింది. ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 83/1తో చివరి రోజు, శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. ఒక దశలో 171/2తో మెరుగైన స్థితిలో కనిపించింది. షెఫాలీవర్మ (63; 83 బంతుల్లో 11×4, 1×6) ఔటైనా.. దీప్తిశర్మ (54), పూనమ్‌ రౌత్‌ (39) ఇన్నింగ్స్‌ను నడిపించారు. కానీ దీప్తి  ఔటయ్యాక భారత పతనం ప్రారంభమైంది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు ఎకిల్‌స్టోన్‌ (4/118), నటాలియా (2/21) విజృంభించడంతో భారత్‌ 28 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 199/7తో కష్టాల్లో పడిపోయింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (4), హర్మన్‌ ప్రీత్‌ (8) స్వల్ప స్కోర్లకే ఔట్‌ కాగా.. కాసేపు నిలిచిన శిఖా పాండే (18) కూడా వెనుదిరగడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సమయం పట్టదనిపించింది. కానీ అనూహ్యంగా ఎదురు నిలిచిన స్నేహ్‌-తానియా అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 104 పరుగులు జత చేసి జట్టును ఓటమి నుంచి బయటపడేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 396/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేయగా.. భారత్‌ 231 పరుగులకే ఆలౌటైంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన