దేశాన్ని ఎదిరించి.. మోసాన్ని బయటపెట్టి

ప్రధానాంశాలు

Published : 27/06/2021 07:12 IST

దేశాన్ని ఎదిరించి.. మోసాన్ని బయటపెట్టి

ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలో అన్యాయంపై లిఖిత్‌ విజయం

దిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్థాన్‌లో టోక్యో ఒలింపిక్స్‌ అర్హత స్విమ్మింగ్‌ టోర్నీ జరిగింది. ఆ నిర్వాహకులు తమ దేశ స్విమ్మర్లకు ప్రయోజనం కలిగించడం కోసం అథ్లెట్ల టైమింగ్‌లో మార్పులు చేశారు. ఇది గమనించిన ఓ భారత యువ స్విమ్మర్‌.. ధైర్యం చేసి వాళ్లను నిలదీశాడు. వాళ్లు బెదిరించినా.. డబ్బు ఇస్తామని ఆశ చూపినా అతను లొంగలేదు. తనపై పిచ్చివాడిగా ముద్ర వేస్తామని హెచ్చరించినా ఖాతరు చేయలేదు. టోర్నీ నుంచి వచ్చాక యూట్యూబ్‌లో ఉన్న ఈ టోర్నీ వీడియోల ఆధారంతో అంతర్జాతీయ స్విమ్మింగ్‌ సమాఖ్య (ఫినా)కు ఫిర్యాదు చేశాడు. దీంతో పూర్తి విచారణ జరిపిన ఫినా.. ఆ టోర్నీ చెల్లదని తాజాగా ప్రకటించింది. అధికారిక రికార్డుల నుంచి ఆ టోర్నీలో పాల్గొన్న స్విమ్మర్ల టైమింగ్‌నూ తొలగించింది. ఇది ఓ దేశానికి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసి.. ఆటకు న్యాయం చేసిన 21 ఏళ్ల బెంగళూరు స్విమ్మర్‌ ఎస్పీ లిఖిత్‌ సాధించిన విజయం. తప్పుడు బాటలో ఒలింపిక్స్‌కు అర్హత సాధిద్దామనుకున్న ఉజ్బెకిస్థాన్‌ స్విమ్మర్లను అతను అడ్డుకున్నాడు. 2019లో పంజాబ్‌లో అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడల సందర్భంగానూ జరిగిన అవకతవకల్ని లిఖిత్‌ బయటపెట్టాడు. అప్పుడు అతని కోసం మూడు రోజుల పాటు రౌడీలు హోటల్‌ బయట ఎదురు చూశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన