బైల్స్‌ పేరిట ట్విటర్‌ ఎమోజీ

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

బైల్స్‌ పేరిట ట్విటర్‌ ఎమోజీ

టోక్యో: అమెరికా సంచలన జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టేందుకు బరిలో దిగబోతోంది. అయితే పోటీకి దిగక ముందే ఆమె సామాజిక మాధ్యమంలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి కారణం బైల్స్‌ పేరిట ట్విటర్‌ ఓ ప్రత్యేకమైన ఎమోజీని తయారు చేయడమే! ట్విటర్‌లో యాష్‌ట్యాగ్‌ పెట్టి బైల్స్‌ అని టైప్‌ చేస్తే మెడలో స్వర్ణ పతకాన్ని ధరించిన ఒక గొర్రె జిమ్నాస్టిక్స్‌ చేస్తున్నట్లుగా ఓ ఎమోజీ వస్తుంది. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (గోట్‌)ను స్ఫూరించేలా ఈ ఎమోజీకి గొర్రె పిల్ల గుర్తుగా పెట్టారు. ట్విటర్‌లో ఇలా ఒక వ్యక్తి పేరిట ఎమోజీ తయారు చేయడం ఇదే తొలిసారి. 2016 రియో ఒలింపిక్స్‌లో బైల్స్‌ నాలుగు స్వర్ణాలతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన