వంద దాటిన కరోనా కేసులు

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

వంద దాటిన కరోనా కేసులు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి కరోనా బారిన పడ్డ వారి సంఖ్య శుక్రవారం 100 దాటింది. క్రీడల ప్రారంభోత్సవం రోజే కొత్తగా 19 మంది పాజిటివ్‌గా తేలారు. అన్ని దేశాల కన్నా చెక్‌ బృందానికి కొవిడ్‌-19 దెబ్బ గట్టిగా తగిలింది. ఆ దేశానికి చెందిన రోడ్‌ సైక్లిస్ట్‌ మైకెల్‌ ష్లెగెల్‌కు తాజాగా పాజిటివ్‌ వచ్చింది. చెక్‌ బృందంలో కరోనా సోకిన నాలుగో అథ్లెట్‌, ఆరో సభ్యుడు అతడు. మొత్తం మీద ఒలింపిక్స్‌తో ప్రమేయమున్న వారిలో ఇప్పటివరకు 106 మందికి పాజిటివ్‌ వచ్చింది. అందులో అథ్లెట్లు 11 మంది. మరోవైపు అమెరికా అథ్లెట్లలో 100 మందికి పైగా కరోనా టీకా వేసుకోలేదని యుఎస్‌ ఒలింపిక్‌, పారాలింపిక్‌ కమిటీ ప్రధాన వైద్యాధికారి జోనాథన్‌ ఫిన్నాఫ్‌ తెలిపాడు. మొత్తం 613 మంది యుఎస్‌ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన