ఇజ్రాయెల్‌ ఆటగాడున్నాడు.. నేనాడను

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

ఇజ్రాయెల్‌ ఆటగాడున్నాడు.. నేనాడను

టోక్యో: డ్రా ప్రకారం ఇజ్రాయెల్‌ ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఒలింపిక్స్‌ పోటీల నుంచి అల్జీరియా జూడో ఆటగాడు ఫెతి నూరీన్‌ తప్పుకున్నాడు. సోమవారం జరిగే 73 కేజీల విభాగం తొలి రౌండ్లో మహ్మద్‌ అబ్దల్‌రసూల్‌ (సూడాన్‌)తో నూరీన్‌ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇజ్రాయెల్‌కు చెందిన తోహర్‌ బుత్‌బుల్‌తో నూరీన్‌ పోటీపడాలి. పాలస్తీనాకు మద్దతునిస్తున్న తాను ఇజ్రాయెల్‌ ఆటగాడితో కరచాలనం చేయడం ద్వారా చేతుల్ని మలినం చేసుకోలేనని అల్జీరియా టీవీతో మాట్లాడుతూ నూరీన్‌ పేర్కొన్నాడు. ఇదే కారణంతో 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి కూడా నూరీన్‌ వైదొలిగాడు. అప్పుడు కూడా అతని ప్రత్యర్థి బుత్‌బుల్‌ కావడం గమనార్హం. ‘‘డ్రాలో దురదృష్టం వెంటాడింది. ఇజ్రాయెల్‌ ప్రత్యర్థి ఎదురయ్యాడు. అందుకే విరమించుకున్నాం. మేం సరైన నిర్ణయం తీసుకున్నాం’’ అని నూరీన్‌ కోచ్‌ అమర్‌ బెన్‌ యక్లిఫ్‌ తెలిపాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన