రాణించని అథ్లెట్లపై చర్యలు

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

రాణించని అథ్లెట్లపై చర్యలు

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రాణించని క్రీడాకారులపై చర్యలు తీసుకుంటామని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) హెచ్చరించింది. ఫామ్‌లో లేని శ్రీశంకర్‌ (లాంగ్‌జంప్‌), కేటీ ఇర్ఫాన్‌ (20 కిమీ నడక)లను జట్టు నుంచి తొలగించొద్దని నిర్ణయించింది. ఏఎఫ్‌ఐ సెలెక్షన్‌ కమిటీ అత్యవసర సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో జరిగిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో శ్రీశంకర్‌, ఇర్ఫాన్‌లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడంతో ఇద్దరు క్రీడాకారుల్ని తప్పించాలని కొందరు సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే క్రీడాకారుల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికే ట్రయల్స్‌ నిర్వహించారని.. ఫామ్‌ కోసం కాదని సెలెక్షన్‌ కమిటీ స్పష్టంచేసింది. ‘‘శ్రీశంకర్‌, ఇర్ఫాన్‌ల కోచ్‌లు మాట్లాడారు. ఇద్దరు ఆటగాళ్లు టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని హామీ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో క్రీడాకారులు రాణించకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం. టోక్యోలో బరిలో ఉన్న 26 మందికి ఇది వర్తిస్తుంది’’ అని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదిల్‌ సుమరివాలా తెలిపాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన