ఎండ వేడికి స్పృహ కోల్పోయిన రష్యన్‌ ఆర్చర్‌

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

ఎండ వేడికి స్పృహ కోల్పోయిన రష్యన్‌ ఆర్చర్‌

టోక్యో: ఒలింపిక్స్‌లో ఎండ వేడికి క్రీడాకారులు అల్లాడుతున్నారు. శుక్రవారం ఎండ వేడి తట్టుకోలేక రష్యన్‌ ఆర్చర్‌ స్వెత్లానా గోంబోవా స్పృహ తప్పి పడిపోయింది. అర్హత రౌండ్లో పోటీపడిన కొద్దిసేపటికే స్వెత్లానా స్పృహ కోల్పోయింది. వెంటనే వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స అందజేశారు. ‘‘నాకు తెలిసి ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి. టోక్యో కోసం సాధన చేసిన వ్లాదివొస్తోక్‌లో ఇలాంటి వాతావరణమే ఉంటుంది. కాని ఇక్కడ తేమ అధిక ప్రభావం చూపుతుంది’’ అని కోచ్‌ స్టానిస్లవ్‌ పొపోవ్‌ తెలిపాడు. ‘‘ఇప్పుడు బాగానే ఉన్నా. తలకు గట్టిగా దెబ్బ తగలింది. అయినా పోటీల్లో పాల్గొంటా. కచ్చితంగా సాధిస్తా’’ అని స్వెత్లానా సామాజిక మాధ్యమంలో పేర్కొంది. అర్హత రౌండ్లో స్వెత్లానా 45వ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో ఆమె బరిలో దిగుతుంది. శుక్రవారం టోక్యోలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన