దీపిక గురి తప్పినా..

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

దీపిక గురి తప్పినా..

టాప్‌-10లో చోటు

ఒలింపిక్‌ ఆర్చరీ ర్యాంకింగ్‌ క్వాలిఫికేషన్‌

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి అడుగును భారత్‌ కాస్త తడబడుతూ వేసింది. పతకాలకు పోటీదారులుగా బరిలో దిగిన మన ఆర్చర్లు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయారు. రికర్వ్‌ వ్యక్తిగత ర్యాంకింగ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ దీపిక కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచింది. పురుషుల్లో అతానుదాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌ టాప్‌-25లో చోటు దక్కించుకోలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల రికర్వ్‌ అర్హత రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్‌ దీపిక (663 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో నిలిచింది. టాప్‌-10లో నిలవడం ద్వారా దీపికకు ప్రిక్వార్టర్స్‌లో సులభమైన ప్రత్యర్థి ఎదురు పడింది. ప్రపంచ 193వ ర్యాంకర్‌ కర్మా (భూటాన్‌)తో దీపిక తలపడనుంది. పురుషుల విభాగంలో భారత ఆర్చర్లు అతాను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ తడబడ్డారు. వీళ్ల ముగ్గురిలో తొలి ఒలింపిక్స్‌ ఆడుతున్న ప్రవీణ్‌ కాస్త మెరుగ్గా రాణించాడు. ర్యాంకింగ్‌ రౌండ్లో ప్రవీణ్‌ (656 పాయింట్లు) 31వ ర్యాంకులో నిలవగా, అతానుదాస్‌ (653 పాయింట్లు)తో 35వ ర్యాంకు, తరుణ్‌దీప్‌ రాయ్‌ (652 పాయింట్లు)తో 37వ ర్యాంకులో నిలిచారు. వీరికి క్వార్టర్స్‌లో కఠిన ప్రత్యర్థులు ఎదురు కానున్నారు. 

అతాను కాదు ప్రవీణ్‌: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపిక కుమారి కొంతకాలంగా తన భర్త అతాను దాస్‌తోనే ఆడుతోంది. అయితే ఒలింపిక్స్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో మాత్రం ఆమె కొత్త భాగస్వామితో బరిలో దిగుతోంది. పురుషుల వ్యక్తిగత క్వాలిఫికేషన్‌లో మెరుగైన ర్యాంకు సాధించిన ప్రవీణ్‌ జాదవ్‌తో కలిసి ఆమె పోటీపడనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన