తొలి స్వర్ణం చైనా ఖాతాలో

ప్రధానాంశాలు

Published : 25/07/2021 02:15 IST

తొలి స్వర్ణం చైనా ఖాతాలో

లింపిక్స్‌ పతకాల సంఖ్యలో అగ్రదేశం అమెరికాను వెనక్కినెట్టాలనే లక్ష్యంతో ఉన్న చైనా ఆ దిశగా ఘనంగా అడుగు వేసింది. టోక్యో ఒలింపిక్స్‌ తొలి పసిడిని ఆ దేశమే దక్కించుకుంది. మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో చైనా షూటర్‌ యాంగ్‌ క్యూయన్‌ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక పతకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందుకోవడం ఓ జీవితకాల అనుభూతి. జాతీయ గీతం వినపడుతుండగా పోడియంపై నిలబడ్డ అథ్లెట్ల మెడలో ముఖ్య అతిథులు పతకాల వేయడం చూడ్డానికి రెండు కళ్లు చాలవు. కానీ ఈ సారి కరోనా కారణంగా ఆ దృశ్యాలు కనిపించడం లేదు. అథ్లెట్లు ఎవరి పతకాలు వాళ్లే మెడలో వేసుకోవాలి. అందుకే క్రీడల తొలి స్వర్ణం నెగ్గిన యాంగ్‌.. అంతర్జాతీయ ఒలింపిక్‌ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ ట్రేలో తెచ్చిన పతకాన్ని తీసుకుని మెడలో వేసుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన