మీరా విజయంలో మనోడు!

ప్రధానాంశాలు

Published : 25/07/2021 02:16 IST

మీరా విజయంలో మనోడు!

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో యావత్‌ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది మీరాబాయి చాను. ఈ మహత్తర విజయంలో చాను కష్టం, త్యాగం.. కోచ్‌ శ్రమతో పాటు మన తెలుగోడి పాత్ర కూడా ఉంది! గత నాలుగేళ్లుగా పటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో చానుకు అన్నీ తానై వ్యవహరించిన అతను మరెవరో కాదు.. కేవీ కోటేశ్వరరావు. చానుతో కోటేశ్వరరావుది నాలుగేళ్ల అనుబంధం. చానుకు మసాజర్‌గా చేరిన కోటేశ్వరరావు ఆమెకు వంట మనిషిగానూ మారాడు. కోటేశ్వరరావును చాను ‘అన్న’ అని పిలిస్తే.. ఆమెను అతను ‘సెల్లి’ అంటూ పలకరిస్తాడు.  టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ప్రత్యేక శిక్షణ కోసం అమెరికా వెళ్లినప్పుడు చాను బాగా గుర్తు చేసుకునేదని కోటేశ్వరరావు తెలిపాడు. ‘‘అన్నా.. ఇక్కడ తాజా చేపలు దొరుకుతాయి. వండి పెట్టేందుకు నువ్వు ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేదో’’ అని చాను అన్నట్లు చెప్పాడు. ‘‘మొదట్లో ఆంధ్ర శైలిలో చికెన్‌ వండేవాడిని. చాలా కారంగా ఉందనడంతో తగ్గించా. దక్షిణ భారత మటన్‌, చికెన్‌ అంటే చానుకు ఎంతో ఇష్టం’’ అని కోటేశ్వరరావు గుర్తు చేసుకున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన