హడలెత్తించిన భానుడు

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:09 IST

హడలెత్తించిన భానుడు

టోక్యో: ఒలింపిక్స్‌ టెన్నిస్‌ కోర్టులో ప్లేయర్లు ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోయారు. భానుడి ప్రతాపానికి హడలెత్తిపోయి గాలి కోసం, మంచు ముక్కల కోసం వెంపర్లాడారు. శనివారం ఆరంభమైన టెన్నిస్‌ పోటీల సమయంలో ఆటగాళ్లు వేడికి, తేమకు ఇబ్బందిపడడం కనిపించింది. ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా నమోదు కావడం విశేషం. ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ పవ్లిచెంకోవా వేడికి తట్టుకోలేక విరామంలో గాలితో సేదతీరింది. కోర్టు పక్కన కంటైనర్‌లో మంచు ముక్కలు కరిగిపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వైటెక్‌తో మ్యాచ్‌లో సర్వీస్‌ చేసేటపుడు పైకి ఎగరేసిన బంతి సూర్యరశ్మి కారణంగా సరిగ్గా కనిపించలేదని ఓటమిపాలైన మోనా వాపోయింది. ఆమె పది డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. ఎండ బారి నుంచి తప్పించుకునేందుకు వీలుగా టెన్నిస్‌ మ్యాచ్‌లు సాయంత్రం నిర్వహించాలని రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌ సూచించాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్లో అతను 6-2, 6-2తో డెలీన్‌ (బొలీవియా)పై నెగ్గాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన