చేయి లేకున్నా సై

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:33 IST

చేయి లేకున్నా సై

శనివారం టోక్యో ఒలింపిక్స్‌ మహిళల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బ్రామ్లీతో పోలెండ్‌ భామ నటాలియా పార్టీకా తలపడింది. మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించిన నటాలియా అలవోకగా తొలి రౌండ్‌ దాటింది. మ్యాచ్‌ సాగుతున్నంతసేపూ ఆమె ఆట అందరినీ ఆకట్టుకుంది. కానీ పరీక్షించి చూస్తేనే ఓ విషయం అర్థమైంది. ఆమెకు కుడిచేయి పూర్తిగా లేదు. మోచేతి వరకే పెరిగి ఆగిపోయింది. అలాంటి దివ్యాంగులు పారాలింపిక్స్‌లో కదా పోటీపడేది మరి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న సాధారణ అథ్లెట్లతో ఈ ఒలింపిక్స్‌లో ఎందుకు తలపడుతోందనే అనుమానం రాక మానదు. నటాలియా ప్రత్యేకతే అది. అటు పారాలింపిక్స్‌లో.. ఇటు ఒలింపిక్స్‌లో ఇలా రెండింట్లోనూ ఆమె గత కొన్నేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తూనే ఉంది. వైకల్యంతోనే పుట్టిన 31 ఏళ్ల ఆమె 2004 ఏథెన్స్‌ పారాలింపిక్స్‌ నుంచి క్లాస్‌ 10 సింగిల్స్‌ విభాగంలో పసిడి పంట పండిస్తోంది. వరుసగా నాలుగు పారాలింపిక్స్‌లోనూ ఆమెనే ఛాంపియన్‌. అద్భుతమైన ఆటతీరుతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్న ఆమె.. సాధారణ అథ్లెట్లుకు ఏ మాత్రం తక్కువ కాదని భావించి 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలో దిగింది. దక్షిణాఫ్రికా స్విమ్మర్‌ నటాలీ తర్వాత ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించిన రెండో అథ్లెట్‌గా ఆమె రికార్డు నమోదు చేసింది. అప్పటి నుంచి ప్రతిసారి ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌లోనూ ఆడుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన