సింధు.. సిద్ధం

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:40 IST

సింధు.. సిద్ధం

మీరాబాయి ఒలింపిక్స్‌లో భారత్‌కు అదిరే ఆరంభాన్నిచ్చింది. ఇప్పుడు ఈ జోరును కొనసాగించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పీవీ సింధు బరిలో దిగుతోంది. ఆదివారం గ్రూప్‌- జెలో తన తొలి మ్యాచ్‌లో పోలికర్పోవా (ఇజ్రాయెల్‌)తో ఆమె తలపడుతుంది. మరోవైపు బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ రింగ్‌లో అడుగుపెట్టనుంది. మహిళల 51 కేజీల విభాగంలో ఆమె డొమినికా బాక్సర్‌ గార్సియాతో పోటీపడుతుంది. టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా- అంకిత రైనా జోడీ పతక వేటకు సిద్ధమైంది. షూటింగ్‌ తొలి రోజు పోటీల్లో నిరాశపర్చిన భారత షూటర్లు.. రెండో రోజు రెండు పతకాంశాల్లో ఆశలు పుట్టిస్తున్నారు. 10మీ. ఎయిర్‌ పిస్టల్‌లో మను బాకర్‌పై భారీ అంచనాలున్నాయి. యశస్విని కూడా పోటీలో ఉంది. పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో దీపక్‌ కుమార్‌, దివ్యాన్ష్‌ సింగ్‌ ఆసక్తి రేపుతున్నారు. దేశానికి రెండో పతకాన్ని ఈ షూటర్లు అందిస్తారేమో చూడాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన