ఇంగ్లాండ్‌కు సూర్య, పృథ్వీ

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:51 IST

ఇంగ్లాండ్‌కు సూర్య, పృథ్వీ

దిల్లీ: సూర్యకుమార్‌ యాదవ్‌కు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కింది. గాయపడ్డ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయాలని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కోరిన నేపథ్యంలో సుర్యకుమార్‌, పృథ్వీ షా ఇంగ్లాండ్‌ వెళ్లనున్నారు. శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అవేష్‌ ఖాన్‌ గాయాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ‘‘పృథ్వీ షా, సూర్య శ్రీలంక నుంచి ఇంగ్లాండ్‌ వెళ్తారు. ఆఫ్‌స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌ కూడా.. వెళ్లాల్సివుంది. క్వారంటైన్‌ అవసరాల రీత్యా ప్రణాళికల్లో కొన్ని మార్పులు జరిగాయి. జయంత్‌ ఇప్పుడు వెళ్లట్లేదు. సూర్య, పృథ్వీలు ఇద్దరూ కొలంబో బయో బబుల్‌ నుంచి నేరుగా ఇంగ్లాండ్‌లో బయో బబుల్‌కు వెళ్తారు. వాళ్లు టీ20 సిరీస్‌ మధ్యలో వెళ్తారా లేదా సిరీస్‌ పూర్తయిన తర్వాత వెళ్తారా అన్నది ఇంకా నిర్ణయం కాలేదు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన