టీటీలో జపాన్‌ మెరుపులు

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:24 IST

టీటీలో జపాన్‌ మెరుపులు

టోక్యో: టేబుల్‌ టెన్నిస్‌లో జపాన్‌ సంచలనం సృష్టించింది. ఫేవరెట్‌ చైనాకు 4-3తో షాకిస్తూ మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో జపాన్‌ జంట.. మిజుతాని జున్‌, ఇటో మిమా అద్భుతంగా పోరాడారు. చైనా జోడీ జు జిన్‌, లియు షివెన్‌కు తొలి రెండు సెట్లు (5-11, 7-11) కోల్పోయాక బలంగా పుంజుకున్నారు. హోరాహోరీ పోరులో తర్వాతి మూడు సెట్లను 11-8, 11-9, 11-9తో చేజిక్కించుకున్నారు. ఆరో సెట్‌ను చైనా 11-6తో గెలిచి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చేసింది. అయితే నిర్ణయాత్మక ఏడో సెట్లో అదరగొట్టిన మిజుతాని జున్‌, ఇటో మిమా జోడీ 11-6తో నెగ్గి జపాన్‌కు పసిడి పతకాన్ని అందించింది.  2016 ఒలింపిక్స్‌లో చైనా అన్ని టీటీ స్వర్ణాలూ గెలుచుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన