డియాజ్‌ సంచలనం

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:28 IST

డియాజ్‌ సంచలనం

టోక్యో ఒలింపిక్స్‌లో ఫిలిప్ఫిన్స్‌ వెయిట్‌లిఫ్టర్‌ హిడ్లీ డియాజ్‌ సంచలనం సృష్టించింది. మహిళల 55 కిలోల విభాగంలో ఒలింపిక్‌ రికార్డును సృష్టిస్తూ ఆమె పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగో ఒలింపిక్స్‌ ఆడుతున్న 30 ఏళ్ల డియాజ్‌ మొత్తం 224 కేజీలు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 126 కేజీలు లిఫ్ట్‌ చేసి చైనా అమ్మాయి లివో ఒలింపిక్‌ రికార్డు సృష్టించగా.. డియాజ్‌ మాత్రం పెద్దగా కష్టపడకుండానే 127 కేజీల బరువు ఎత్తి ఆ రికార్డును వెంటనే బద్దలు కొట్టింది. ఫిలిప్ఫీన్స్‌ చరిత్రలో తొలిసారి ఒలింపిక్‌ స్వర్ణాన్ని అందించిన డియాజ్‌ ఆనందాన్ని పట్టలేకపోయింది. గట్టిగా ఏడ్చేస్తూ కోచ్‌లను కౌగిలించుకుంది. ఈ విజయంతో వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా క్లీన్‌స్వీప్‌ ఆశలకు కూడా ఆమె గండి కొట్టింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన