డైవింగ్‌లో చైనాకు చెక్‌

ప్రధానాంశాలు

Published : 27/07/2021 03:33 IST

డైవింగ్‌లో చైనాకు చెక్‌

బ్రిటన్‌ జోడీకి బంగారు పతకం

టోక్యో: డైవింగ్‌లో పసిడి పతకాలను క్లీన్‌స్వీప్‌ చేయాలనుకున్న చైనాకు ఆశాభంగం. చైనా జంటను కొద్ది తేడాతో వెనక్కి నెడుతూ... 10 మీటర్ల సింక్రనైజ్డ్‌ డైవింగ్‌లో టామ్‌ డేల్‌-మ్యాట్‌ లీ (బ్రిటన్‌) జోడీ స్వర్ణం సొంతం చేసుకుంది. డేల్‌-లీ జంట మొత్తం 471.81 పాయింట్లు స్కోర్‌ చేయగా.. కావ్‌ యువాన్‌-చెన్‌ ఐసెన్‌ (చైనా) ద్వయం 470.58 పాయింట్లు సాధించింది. అలెగ్జాండర్‌ బొండార్‌-విక్టర్‌ మినిబేవ్‌ (రష్యా) జంట కాంస్యం గెలుచుకుంది. చైనా డైవింగ్‌లో ఆదివారం తొలి స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. మహిళల 3 మీటర్ల సింక్రో స్ప్రింగ్‌బోర్డ్‌లో తింగ్మావో వాంగ్‌-వాంగ్‌ హాన్‌ వొన్‌ జంట విజేతగా నిలిచింది. డైవింగ్‌లో మొత్తం ఎనిమిది స్వర్ణాలు అందుబాటులో ఉన్నాయి. గత ఒలింపిక్స్‌లో చైనా ఏడు స్వర్ణాలతో డైవింగ్‌లో అగ్రస్థానం సాధించింది. అప్పుడు కూడా బ్రిటన్‌ జోడీ వల్లే క్లీన్‌స్వీప్‌
చేయలేకపోయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన