అలలపై అమెరికా, బ్రెజిల్‌ హవా

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

అలలపై అమెరికా, బ్రెజిల్‌ హవా

టోక్యో: ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన సర్ఫింగ్‌లో మహిళల విభాగంలో అమెరికా, పురుషుల విభాగంలో బ్రెజిల్‌ స్వర్ణ పతకాలు గెలుచుకున్నాయి. మహిళల్లో కరిస్సా మూర్‌ (అమెరికా) స్వర్ణాన్ని సాధించింది. తుపాను కారణంగా సురిగాసాకి బీచ్‌లో ఎగసిపడుతున్న అలలపై మూర్‌ అద్భుత ప్రదర్శన చేసి అగ్రస్థానంలో నిలిచింది. సర్ఫింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ అయిన కరిస్సా... ఫైనల్లో దక్షిణాఫ్రికా అమ్మాయి బియాంక బిటెన్‌డగ్‌ నుంచి పోటీ ఎదురైనా నిలిచి గెలిచింది. పురుషుల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ ఇటాలో ఫెరీరా (బ్రెజిల్‌) పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. స్వర్ణ పతక పోరులో అతడు.. కనో ఇగరాషి (జపాన్‌)పై పైచేయి సాధించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన