మెకోన్‌ స్వర్ణం వెనుక..

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

మెకోన్‌ స్వర్ణం వెనుక..

టోక్యో: మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ స్వర్ణాన్ని ఆస్ట్రేలియా తార కైల్‌ మెకోన్‌ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఈ ప్రపంచ ఛాంపియన్‌ 57.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఒలింపిక్‌ రికార్డును సృష్టిస్తూ పసిడి ఎగరేసుకుపోయింది. ప్రపంచ రికార్డు నెలకొల్పిన నేపథ్యం ఉన్న కైల్‌ మెస్‌ (కెనడా, 57.72 సెకన్లు) రజతం, రెగాన్‌ స్మిత్‌ (అమెరికా, 58.05 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నారు. నాన్న కలను నెరవేర్చిన ఆనందంలో 20 ఏళ్ల మెకోన్‌ ఉద్వేగానికి గురైంది. తన కూతురు ఒలింపిక్‌ ఛాంపియన్‌ కావాలని కలగన్న మెకోన్‌ నాన్న షెల్టో గతేడాది ఆగస్టులో బ్రెయిన్‌ క్యాన్సర్‌తో మరణించాడు. కరోనా కారణంగా టోక్యో క్రీడలు ఏడాది వాయిదా పడకుండా ఉంటే తన కుమార్తె విజయాన్ని షెల్టో చూసే అవకాశం ఉండేది. నాన్న మరణం బాధిస్తుండగానే మళ్లీ స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగిన మెకోన్‌.. ఈ జూన్‌లో జరిగిన ఆస్ట్రేలియా స్విమ్మింగ్‌ ట్రయల్స్‌లో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. అదే పట్టుదలతో ఒలింపిక్స్‌లోనూ ఆడి రెగాన్‌ స్మిత్‌, కైల్‌ మెస్‌ లాంటి మాజీ ప్రపంచ ఛాంపియన్లను వెనక్కి నెట్టి పసిడి గెలుచుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన