వినేశ్‌.. విమానం తప్పింది

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

వినేశ్‌.. విమానం తప్పింది

దిల్లీ: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ టోక్యో చేరుకోవడం ఆలస్యం కానుంది. ఒలింపిక్స్‌ కోసం హంగేరీలో శిక్షణ పొందిన వినేశ్‌.. టోక్యోకు వస్తున్న క్రమంలో చిన్న సమస్యలో చిక్కుకుని విమానం ఎక్కలేకపోయింది. యూరోపియన్‌ యూనియన్‌ వీసా పరిమితికి మించి ఒక రోజు ఎక్కువగా ఐరోపాలో ఉన్నందుకు ఆమెను జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో ఆపేశారు. ఇక్కడి నుంచి ఆమె టోక్యోకు కనెక్టింగ్‌ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే వినేశ్‌కు ఇబ్బంది రాకుండా వెంటనే సమస్యను పరిష్కరించామని, ఆమె బుధవారమే టోక్యోకు చేరుకుంటుందని భారత ఒలింపిక్‌ సంఘం వర్గాలు తెలిపాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన