డైవింగ్‌లో టీనేజీ హోరు

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

డైవింగ్‌లో టీనేజీ హోరు

టోక్యో: ఒకరి వయసు 15 ఏళ్లు.. ఇంకొకరిది 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పసిడి పట్టేశారు. టోక్యో ఒలింపిక్స్‌ సింక్రనైజ్డ్‌ డైవింగ్‌లో దృశ్యమిది. 10 మీటర్ల సింక్రనైజ్డ్‌ డైవింగ్‌లో చైనాకు చెందిన పదిహేనేళ్ల చెంగ్‌ యు, పదిహేడేళ్ల జాంగ్‌ జియాకి (363.78 పాయింట్లు) స్వర్ణ పతకం సాధించారు. రెండో స్థానంలో నిలిచిన జెస్సికా, డెన్లీ (అమెరికా, 310.80) కన్నా వీరు 50 పాయింట్లు ఎక్కువ సాధించడం విశేషం. ఈ ఈవెంట్లో పాల్గొన్న పిన్న వయస్కులు కూడా వీళ్లే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన