కృనాల్‌కు కరోనా

ప్రధానాంశాలు

Published : 28/07/2021 02:59 IST

కృనాల్‌కు కరోనా

రెండో టీ20 నేటికి వాయిదా

కొలంబో: బయో బబుల్‌లోనే ఉన్నప్పటికీ శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు కరోనా నుంచి తప్పించుకోలేకపోయింది. ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యకు కొవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో మంగళవారం శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20 బుధవారానికి వాయిదా పడింది. ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సినందున కృనాల్‌ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతడితో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మంది కూడా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఆటగాళ్లే. ఆర్టీ-పీసీఆర్‌లో వీళ్లందరికీ నెగెటివ్‌ వచ్చింది. అయినా ముందు జాగ్రత్త చర్యగా వీరిని రెండో టీ20లో బరిలోకి దించట్లేదు. కాబట్టి భారత్‌ కాస్త బలహీనపడ్డ జట్టుతోనే ఆడనుంది. గురువారం మూడో టీ20 ముగిశాక కృనాల్‌ జట్టుతో పాటు భారత్‌ రాలేడు. నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌ ముగిశాక, ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చాక అతడు లంక నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. ‘‘కృనాల్‌లో లక్షణాలు ఉన్నాయి. అతడు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నాడు. కృనాల్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. మిగతా జట్టుతో పాటు అతడు స్వదేశానికి రాలేడు. అయితే అతడితో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మందికి నెగెటివ్‌ వచ్చింది’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇంకొద్దిమందికి పాజిటివ్‌ వచ్చినా.. జట్టును బరిలోకి దించడానికి అవసరమైన ఆటగాళ్లు భారత్‌కు ఉన్నారు. భారత్‌ 20 మంది సభ్యులతో శ్రీలంక వెళ్లింది. నలుగురు స్టాండ్‌బై నెట్‌బౌలర్లు కూడా జట్టుతో ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన