కరోనాను దాటి.. పసిడి ముద్దాడి

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:00 IST

కరోనాను దాటి.. పసిడి ముద్దాడి

టోక్యో: కరోనాకు గురైన వాళ్లలో చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ అతను నాలుగు నెలల వ్యవధిలోనే రెండు సార్లు మహమ్మారి బారిన పడ్డాడు. దీంతో అతని హృదయనాళ వ్యవస్థ, ఊపిరితిత్తులపై ప్రభావం పడింది. చాలా కాలం పాటు దగ్గు తగ్గలేదు. ఆ పరిస్థితుల నుంచి ఆత్మవిశ్వాసంతో బయట పడ్డ బ్రిటన్‌ స్విమ్మర్‌ టామ్‌ డీన్‌ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌ పోడియంపై సగర్వంగా నిలబడ్డాడు.  స్వర్ణంతో సత్తాచాటాడు. మంగళవారం పురుషుల 200మీ. ఫ్రీస్టైల్‌లో డీన్‌ విజేతగా నిలిచాడు. ఒక్క నిమిషం 44.22 సెకన్లలో రేసు ముగించి బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఆ పోటీలో రజతం కూడా అదే దేశానికి చెందిన స్కాట్‌ (1:44.26సె) సొంతం చేసుకున్నాడు. కొలనులో మళ్లీ దిగి ఈ వేగంతో ఈదగలనని ఈ ఏడాది జనవరిలో డీన్‌ అనుకోలేదు. రెండో సారి సోకిన కరోనా అతని ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపడమే అందుకు కారణం. దీని నుంచి కోలుకోవడం కోసం క్వారంటైన్‌లో ఉన్న అతను కొలనుకు ఏడు వారాల పాటు దూరమయ్యాడు. బలహీనంగా మారడంతో ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో రాణించి టోక్యో వెళ్లగలననే నమ్మకాన్ని కోల్పోయాడు. ఆ సమయంలో కోచ్‌ డేవిడ్‌.. అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. తిరిగి మునుపటి స్థాయికి చేరేలా ప్రోత్సహించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన