ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా ఔట్‌

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా ఔట్‌

సైటమా: ఒలింపిక్స్‌ ఫుట్‌బాల్‌లో ఆశ్చర్యకర ఫలితాలొచ్చాయి.. స్వర్ణంపై గురిపెట్టిన అర్జెంటీనాతో పాటు గత క్రీడల ఫైనలిస్టు జర్మనీ, పసిడికి పోటీలో ఉన్న ఫ్రాన్స్‌ కూడా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించాయి. తప్పక గెలవాల్సిన ఆఖరి గ్రూప్‌-సి పోరులో అర్జెంటీనా 1-1తో స్పెయిన్‌తో డ్రా చేసుకుంది. దీంతో మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్కో విజయం, ఓటమి, డ్రాతో నాలుగు పాయింట్లు సాధించిన అర్జెంటీనా నాకౌట్‌కు దూరమైంది. ఇక గ్రూప్‌-డిలో మూడో స్థానంలో నిలిచిన జర్మనీతో పాటు గ్రూప్‌-ఎలో అదే స్థానం సాధించిన ఫ్రాన్స్‌ కూడా ముందంజ వేయలేకపోయాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన