ఫిజీదే రగ్బీ సెవెన్స్‌ పసిడి

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

ఫిజీదే రగ్బీ సెవెన్స్‌ పసిడి

టోక్యో: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫిజి రగ్బీ సెవెన్స్‌లో ఒలింపిక్‌ స్వర్ణాణ్ని నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు 27-12తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. అర్జెంటీనాకు కాంస్య పతకం దక్కింది. రియో ఒలింపిక్స్‌లో ఫిజి జట్టు పసిడి గెలిచినప్పుడు.. ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఒక జాతీయ సెలవును కూడా ప్రకటించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో ఫిజికి లభించిన తొలి పతకం అది. ఇప్పుడు టోక్యోలో రెండో పతకం వచ్చింది. రగ్బీ.. ఫిజి జాతీయ క్రీడ. రగ్బీ సెవెన్స్‌ అంటే ఆ దేశ ప్రజలకు మక్కువ ఎక్కువ.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన