మొమొటో కల చెదిరింది

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

మొమొటో కల చెదిరింది

టోక్యో: సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలనే పట్టుదలతో దిగిన జపాన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ కెంటో మెమొటోకు షాక్‌ తగిలింది. ఈ ప్రపంచ నంబర్‌వన్‌ గ్రూప్‌ దశలోనే పోటీల నుంచి నిష్క్రమించాడు. ఆఖరి లీగ్‌ పోరులో కెంటో 15-21, 19-21తో హివాంగ్‌ హి (కొరియా) చేతిలో కంగుతిన్నాడు. గ్రూప్‌ దశలో తొలి మ్యాచ్‌లో లామ్‌ (అమెరికా)పై గెలిచిన మొమొటో.. రెండో మ్యాచ్‌లో ఓడిపోవడంతో నిష్క్రమించక తప్పలేదు. రెండు మ్యాచ్‌లు గెలిచిన హివాంగ్‌ హి ఈ గ్రూప్‌ నుంచి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన