వందేళ్ల తర్వాత తొలిసారి

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

వందేళ్ల తర్వాత తొలిసారి

టోక్యో: ఒలింపిక్స్‌లో బ్రిటన్‌ స్విమ్మర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వందేళ్ల తర్వాత తొలిసారి ఆ దేశానికి రిలే స్వర్ణాన్ని అందించారు. బుధవారం పురుషుల 4×200మీ. ఫ్రీస్టైల్‌ రిలేలో 6 నిమిషాల 58.58 సెకన్ల టైమింగ్‌తో బ్రిటన్‌ స్విమ్మర్లు పసిడి ఎగరేసుకుపోయారు. 200మీ. ఫ్రీస్టైల్‌లో వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలిచిన డీన్‌, స్కాట్‌ బ్రిటన్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. రష్యా ఒలింపిక్‌ కమిటీ (7:01.81సె), ఆస్ట్రేలియా (7:01.84) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 1912 క్రీడల (మహిళల 4×100మీ. ఫ్రీస్టైల్‌) తర్వాత స్విమ్మింగ్‌ రిలేలో బ్రిటన్‌కిదే తొలి స్వర్ణం. టోక్యోలో ఈ రిలేలో అమెరికా కనీసం కాంస్యం కూడా గెలవకపోవడంతో ఆ దేశ దిగ్గజ స్విమ్మర్‌ మైకెల్‌ ఫెల్ప్స్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. డ్రెసెల్‌ను రిలే జట్టులోకి తీసుకోకపోవడంతో తీవ్రమైన విమర్శలు చేశాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన