అలనాటి షట్లర్‌ నందు కన్నుమూత

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

అలనాటి షట్లర్‌ నందు కన్నుమూత

పుణె: బ్యాడ్మింటన్‌ దిగ్గజం నందు నటేకర్‌ తుదిశ్వాస విడిచారు. భారత బ్యాడ్మింటన్‌ తొలి తరం అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన ఆయన బుధవారం కన్నుమూశారు. వయసు సంబంధిత సమస్యలతో 88 ఏళ్ల వయసులో మరణించారు. తన కెరీర్‌లో 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన ఆయనకు ఓ తనయుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆయన జన్మించారు. ఆటలో ఎన్నో అత్యుత్తమ విజయాలు సాధించి ఎంతో మంది గొప్ప షట్లర్లకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన మృతి పట్ల దేశ ప్రధాన మంత్రి మోదీ సహా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అర్జున అవార్డు (1961లో) అందుకున్న తొలి బ్యాడ్మింటన్‌ ఆటగాడు నందు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన