ప్రపంచ ఛాంపియన్‌కు పాజిటివ్‌

ప్రధానాంశాలు

Published : 30/07/2021 02:41 IST

ప్రపంచ ఛాంపియన్‌కు పాజిటివ్‌

టోక్యో: ఒలింపిక్స్‌లో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మహమ్మారి ఆస్ట్రేలియా ట్రాక్‌ అథ్లెట్లలో కలకలం రేపింది. అమెరికా పోల్‌ వాల్ట్‌ అథ్లెట్‌ సామ్‌ కెండ్రిక్స్‌కు గురువారం పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ కెండ్రిక్స్‌.. శనివారం పురుషుల పోల్‌వాల్ట్‌లో బరిలో దిగాల్సింది. కొన్ని రోజులుగా అతను ట్రాక్‌పై మిగతా అథ్లెట్లతో కలిసి సాధన చేశాడు. అందులో ముగ్గురు ఆస్ట్రేలియా అథ్లెట్లు కెండ్రిక్స్‌తో సన్నిహితంగా మెలిగారు. దీంతో తమ ట్రాక్‌ అథ్లెట్ల బృందాన్ని (41 మంది అథ్లెట్లు, 13 మంది ప్రతినిధులు) ఆస్ట్రేలియా కొన్ని గంటల పాటు ఐసోలేషనల్‌ పెట్టింది. ఆ ముగ్గురు అథ్లెట్లకు నెగెటివ్‌ అని తేలిన తర్వాతనే మిగతా వాళ్లను ఐసోలేషన్‌ నుంచి తప్పించారు. మరోవైపు కెండ్రిక్స్‌ను ఇతర దేశాల అథ్లెట్లు ఎంతమంది కలిశారో అనే దానిపై స్పష్టత లేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన