బైల్స్‌ లేకున్నా లీ గెలిచె

ప్రధానాంశాలు

Published : 30/07/2021 02:41 IST

బైల్స్‌ లేకున్నా లీ గెలిచె

ఆల్‌రౌండ్‌ జిమ్నాస్టిక్స్‌లో అమెరికాకే స్వర్ణం

టోక్యో: మహిళల జిమ్నాస్టిక్స్‌ అన్ని విభాగాల్లోనూ ఛాంపియన్‌గా నిలుస్తుందని ఒలింపిక్స్‌కు ముందు అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టోక్యోలో మానసిక సమస్యతో టీమ్‌ విభాగం మధ్యలో తప్పుకున్న ఆమె.. వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ విభాగంలో పోటీలోనే దిగలేదు. దీంతో గురువారం మహిళల ఆల్‌రౌండ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బైల్స్‌  లేని అమెరికాకు స్వర్ణం రావడం కష్టమేనని అంతా భావించారు. కానీ 18 ఏళ్ల యువ సంచలనం సునీసా లీ అద్భుతమే చేసింది. దేశం ఆశలు మోస్తూ బరిలో దిగిన ఆమె పసిడితో సత్తాచాటింది. మొత్తం 57.433 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. రెబెకా (బ్రెజిల్‌- 57.298) రజతం, రష్యా ఒలింపిక్‌ కమిటీ జిమ్నాస్ట్‌ మెల్నికోవా (57.199) కాంస్యం గెలిచారు. లీ విజయంతో ఒలింపిక్స్‌ ఆల్‌రౌండ్‌ మహిళల జిమ్నాస్టిక్స్‌లో వరుసగా అయిదో స్వర్ణం అమెరికా ఖాతాలో చేరింది. 1984 క్రీడల నుంచి ఈ విభాగంలో పెత్తనం ఆ దేశానిదే.


న్‌ఈవెన్‌ బార్స్‌లో అత్యధికంగా 15.300 స్కోరుతో పతకం సాధించే అవకాశాలు మెరుగుపర్చుకున్న లీ.. అంతకుముందు వాల్ట్‌లోనూ (14.600) మెరుగైన స్కోరు అందుకుంది. ఆ తర్వాత బ్యాలెన్స్‌ బీమ్‌ (13.833), ఫ్లోర్‌ (13.700)లోనూ మంచి ప్రదర్శన చూపింది. విజేతగా నిలిచాక భావోద్వేగం తట్టుకోలేక లీ ఏడ్చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన