విజయం నాదే అనుకున్నా.. తీర్పుపై మేరీ ఆగ్రహం

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 05:49 IST

విజయం నాదే అనుకున్నా.. తీర్పుపై మేరీ ఆగ్రహం

దిల్లీ: ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో తప్పుడు తీర్పుపై మేరీ కోమ్‌ ఆగ్రహం వ్యక్తంజేసింది. ప్రిక్వార్టర్స్‌ బౌట్‌లో మూడింట్లో రెండు రౌండ్లు గెలిచినా మేరీ ఓడిపోయినట్లు అంపైర్లు ప్రకటించారు. దీనిపై మేరీ భగ్గుమంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) బాక్సింగ్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏం చేస్తుందంటూ ధ్వజమెత్తింది. ‘‘ఈ నిర్ణయం నాకు అర్థం కాలేదు. టాస్క్‌ఫోర్స్‌కు ఏమైంది? ఐఓసీ ఏం చేస్తోంది? టాస్క్‌ఫోర్స్‌లో నేనూ సభ్యురాలిగా ఉన్నా. నిష్పాక్షికంగా పోటీలు నిర్వహించాలంటూ సలహాలూ ఇచ్చా. మరి నాకెందుకు ఇలా చేశారు? రింగ్‌లో ఉన్నప్పుడు.. బయటకొచ్చాక కూడా నేను గెలిచాననే ఆనందంగా ఉన్నా. డోపింగ్‌ పరీక్షలకు తీసుకెళ్తున్నప్పుడు కూడా సంతోషంగా ఉన్నా. సామాజిక మాధ్యమంలో చూసిన తర్వాత, కోచ్‌ చెప్పాక నేను ఓడిపోయినట్లు తెలిసింది. నా ప్రత్యర్థిని గతంలో రెండు సార్లు ఓడించా. ఆమెని విజేతగా ప్రకటించడం నమ్మలేకపోతున్నా. ఒట్టేసి చెబుతున్నా నేను ఓడిపోలేదు’’ అని మేరీ తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన