స్టోక్స్‌ క్రికెట్‌కు దూరంగా..

ప్రధానాంశాలు

Published : 31/07/2021 03:04 IST

స్టోక్స్‌ క్రికెట్‌కు దూరంగా..

లండన్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం తీసుకున్నాడు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఎడమ చూపుడు వేలి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం కూడా స్టోక్స్‌ విరామం తీసుకోవడానికి కారణమని ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. స్టోక్స్‌ స్థానంలో క్రెయిగ్‌ ఎవర్టన్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు ఎంపికయ్యాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు ఆగస్టు 4న ఆరంభమవుతుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన