జకోవిచ్‌కు జ్వెరెవ్‌ షాక్‌

ప్రధానాంశాలు

Published : 31/07/2021 03:04 IST

జకోవిచ్‌కు జ్వెరెవ్‌ షాక్‌

టోక్యో: నొవాక్‌ జకోవిచ్‌కు గోల్డెన్‌ స్లామ్‌ దక్కబోవట్లేదు. ఈ ప్రపంచ నంబర్‌వన్‌కు ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో షాక్‌ తగిలింది. జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 1-6, 6-3, 6-1తో జకోవిచ్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఒకే ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు, ఒలింపిక్‌ స్వర్ణం గెలిస్తే గోల్డెన్‌స్లామ్‌ అంటారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ గెలిచిన జకోవిచ్‌.. ఒలింపిక్స్‌లో గెలిచి, యుఎస్‌ ఓపెన్‌ సాధిస్తే గోల్డెన్‌స్లామ్‌ సాధించేవాడు. సెమీస్‌లో ఓటమితో ఆ అవకాశం కోల్పోయాడు. జ్వెరెవ్‌ స్వర్ణం కోసం కచనోవ్‌ (రష్యా)తో తలపడతాడు. సెమీస్‌లో కచనోవ్‌ 6-3, 6-3తో కారెనో బుస్టా (స్పెయిన్‌)ను ఓడించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన