తై జును దాటితేనే...

ప్రధానాంశాలు

Published : 31/07/2021 03:04 IST

తై జును దాటితేనే...

సాధారణ ఆటతీరులో ఒక్కో అడుగు వేస్తున్న సింధుకు.. ఒలింపిక్స్‌ స్వర్ణానికి  శనివారం  అతిపెద్ద అడ్డంకి ఎదురుకానుంది. సెమీస్‌లో తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు పోటీపడనుంది. తన కెరీర్‌లో సింధు అత్యధికంగా ఓడింది తై జు చేతిలోనే. ఇప్పటి వరకు వీరిద్దరు 18 సార్లు తలపడగా.. 13 మార్లు తై జు నెగ్గింది. అయిదు సార్లు సింధు గెలిచింది. అయితే పెద్ద టోర్నీల్లో తై జుపై పైచేయి సాధించడం సింధుకు కలిసొచ్చే అంశం. 2016 రియో ఒలింపిక్స్‌, 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, 2018 ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో తై జుపై సింధు నెగ్గింది. శనివారం సెమీస్‌లో గెలిస్తే స్వర్ణానికి సింధు దాదాపుగా చేరువైనట్లే! మరో సెమీస్‌లో ఇద్దరు చైనీస్‌ క్రీడాకారులే తలపడుతున్నారు. వారిలో ఎవరు ప్రత్యర్థిగా ఎదురైనా సింధుకు నల్లేరుపై నడకే. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో తై జు 14-21, 21-18, 21-18తో మరో  íÆవరెట్‌ ఇంతానన్‌ రచనోక్‌  (థాయ్‌లాండ్‌)పై నెగ్గింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన