జమైకమేనా!

ప్రధానాంశాలు

Updated : 31/07/2021 04:58 IST

జమైకమేనా!

ఫ్రేజర్‌ × ఎలేన్‌

మహిళల 100 మీ. ఫైనల్‌ నేడే

మహిళల 100మీ పరుగు : సెమీస్‌ మ।। 3.45 నుంచి

ఫైనల్‌ సా।। 6.20 నుంచి

పురుషుల 100 మీ పరుగు హీట్స్‌

ఉదయం 8.05 నుంచి

టోక్యో: ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మహిళ ఎవరో తేల్చే పోటీకి సమయం ఆసన్నమైంది. మహిళల 100 మీటర్ల పరుగు ఫైనల్‌ శనివారమే జరగబోతోంది. ఎప్పట్లాగే ఈ పోటీలో జమైకా అథ్లెట్ల ఆధిపత్యమే సాగుతుందని అంచనా. 2008, 2012 ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచి.. గత పర్యాయం కాంస్యానికి పరిమితమైన దిగ్గజ స్ప్రింటర్‌ షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ఈసారి పసిడే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆమెకు సహచర అథ్లెట్‌ ఎలేన్‌ థాంప్సన్‌ హెరా నుంచి గట్టి పోటీ ఎదురవడం ఖాయం. ఆమె 2016లో 100 మీ.తో పాటు 200 మీ. పసిడి గెలవడం గమనార్హం. పసిడి, రజతం వీరిని దాటి వెళ్లకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. గ్రేట్‌ బ్రిటన్‌ స్ప్రింటర్‌ దినా ఆషర్‌ స్మిత్‌.. ఆఫ్రికా అమ్మాయిలు మార్లీ జోస్‌ (ఐవరీ కోస్ట్‌), బ్లెస్సింగ్‌ ఒకాగ్బరె (నైజీరియా) కూడా చూడదగ్గ అథ్లెట్లే. శుక్రవారం హీట్స్‌లో వీరంతా ముందంజ వేశారు. శనివారం ముందుగా సెమీస్‌, ఆ తర్వాత ఫైనల్‌ జరుగుతాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన