అమిత్‌కు షాక్‌

ప్రధానాంశాలు

Published : 01/08/2021 03:03 IST

అమిత్‌కు షాక్‌

బాక్సింగ్‌లో భారత్‌కు ఊహించని ఫలితం! కచ్చితంగా పతకం తెస్తాడన్న అంచనాలు ఉన్న టాప్‌ సీడ్‌ అమిత్‌ పంగాల్‌ (52 కిలోలు) ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. ఈ పోరులో అమిత్‌ 1-4తో మార్టినెజ్‌ రివాస్‌ (కొలంబియా) చేతిలో కంగుతిన్నాడు. తొలి రౌండ్లో రింగ్‌లో వేగంగా కదులుతూ పాయింట్లు సాధించిన పంగాల్‌.. ఆ తర్వాత రౌండ్లలో అనూహ్యంగా వెనకబడిపోయాడు. ప్రత్యర్థి దూకుడుగా ఆడగా.. పంగాల్‌ మాత్రం ఎదురుదాడి చేయలేకపోయాడు. ముఖ్యంగా మూడో రౌండ్లో అయితే చాలా అలిసిపోయినట్లు కనిపించిన పంగాల్‌.. ప్రత్యర్థికి సవాలే విసరలేకపోయాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న మార్టినెజ్‌ సులభంగా బౌట్‌ను దక్కించుకున్నాడు. మహిళల బాక్సింగ్‌లో పతకంపై ఆశలు రేపిన పూజారాణీ (75 కిలోలు) క్వార్టర్స్‌లో ఓడిపోయింది. ఈ పోరులో పూజ 0-5తో లి క్విన్‌ (చైనా) చేతిలో చిత్తయింది. ప్రత్యర్థి దూకుడు ముందు పూజ పూర్తిగా తేలిపోయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన