అంతర్జాతీయ క్రికెట్‌కు ఉదాన వీడ్కోలు

ప్రధానాంశాలు

Published : 01/08/2021 03:03 IST

అంతర్జాతీయ క్రికెట్‌కు ఉదాన వీడ్కోలు

కొలంబో: శ్రీలంక లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఉదాన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 12 ఏళ్ల నుంచి లంక క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ 21 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. వన్డేల్లో 18 వికెట్లు, టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. 2009లో టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన ఉదాన.. 2012లో భారత్‌పై కెరీర్‌లో తొలి వన్డే ఆడాడు. భారత్‌తో తాజాగా ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ 33 ఏళ్ల ఉదాన లంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కూడా ఈ పేసర్‌ ఆడాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన