లేటు వయసులో పసిడి పట్టాడు

ప్రధానాంశాలు

Published : 01/08/2021 03:20 IST

లేటు వయసులో పసిడి పట్టాడు

టోక్యో: చైనా వెటరన్‌ వెయిట్‌లిఫ్టర్‌ యు జియాజున్‌ సత్తా చాటాడు. 37 ఏళ్ల వయసులో వెయిట్‌లిఫ్టింగ్‌లో పసిడి కొట్టి ఈ ఆటలో ఒలింపిక్స్‌ స్వర్ణం సాధించిన పెద్ద వయస్కుడిగా ఘనతను సొంతం చేసుకున్నాడు. పురుషుల 81 కిలోల విభాగంలో స్నాచ్‌లో 170 కిలోలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 204 కిలోలు ఎత్తిన యు జియాజున్‌ మొత్తం మీద 374 కిలోలతో అగ్రస్థానంలో నిలిచాడు. 2016లో  రజతం నెగ్గిన అతడి ఖాతాలో 2012 లండన్‌ స్వర్ణం కూడా ఉంది. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటానని జియాజున్‌ అంటున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన