డోప్‌ పరీక్షలో దొరికిన నైజీరియా అథ్లెట్‌

ప్రధానాంశాలు

Published : 01/08/2021 03:20 IST

డోప్‌ పరీక్షలో దొరికిన నైజీరియా అథ్లెట్‌

టోక్యో: డోపింగ్‌ పాల్పడ్డందుకు నైజీరియా స్ప్రింటర్‌ బ్లెస్సింగ్‌ ఒకాగ్బేర్‌ తాత్కాలిక నిషేధానికి గురైంది. శనివారం మహిళల 100 మీటర్ల సెమీఫైనల్‌ రేసులో పోటీపడడానికి కొన్ని గంటల ముందు ఆమెపై వేటు పడింది. జులై 19న పోటీల వెలుపల నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో ఒకాగ్బేర్‌ విఫలమైంది. ఆ పరీక్ష ఫలితాలు శుక్రవారం వచ్చాయి. ఒకాగ్బేర్‌ నమూనాల్లో హ్యూమన్‌ గ్రోత్‌ హార్మోన్‌ ఉన్నట్లు తేలింది. ఆమె ఇక ‘బి’ నమూనాను పరీక్షించాలని కోరవచ్చు. మరోవైపు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినందుకు కెన్యా స్ప్రింటర్‌ మార్క్‌ ఒదియాంబో కూడా తాత్కాలిక నిషేధానికి గురయ్యాడు. డోపింగ్‌లో పట్టుబడ్డ అథ్లెట్లపై.. విచారణ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు. డోపింగ్‌కు పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదలమని ఐఓసీ చెప్పింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన