రోడ్డును తెచ్చిన పతకం

ప్రధానాంశాలు

Updated : 04/08/2021 03:23 IST

రోడ్డును తెచ్చిన పతకం

బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌కు పతకం ఖాయం కావడంతో సంబరాలు చేసుకుంటున్న ఆమె ఊరు ప్రజల సంతోషాన్ని మరింత పెంచే పరిణామం. అస్సాంలోని గోల్‌ఘాట్‌ జిల్లాలో ఉన్న బరోముతియా అనే ఆ గ్రామానికి ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు. చాలా ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై దారుణమైన స్థితిలో ఉన్న ఆ 3.5 కిలోమీటర్ల మట్టి రోడ్డును పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ బాగు చేస్తోంది. లవ్లీనా ఒలింపిక్స్‌ నుంచి తిరిగొచ్చే లోపు తారు రోడ్డు వేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బిశ్వజిత్‌ ఫుకాన్‌ ఈ రహదారి నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన