ఒక్కటి తప్ప అన్నీ చైనాకే

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:42 IST

ఒక్కటి తప్ప అన్నీ చైనాకే

డైవింగ్‌లో అయిదో స్వర్ణం సొంతం

టోక్యో: డైవింగ్‌లో చైనా తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఈ ఈవెంట్లో ఆ దేశం ఇంకో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. పురుషుల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌లో గ్జి సియ్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతడు 558.75 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో రజతం కూడా చైనానే సొంతం చేసుకుంది. వాంగ్‌ జాంగ్‌ యువాన్‌ (534.90) ద్వితీయ స్థానం సాధించాడు. టోక్యోలో డైవింగ్‌లో ఆరు ఈవెంట్లలో అయిదు స్వర్ణాలను చైనా హస్తగతం చేసుకుంది. అయితే పురుషుల 10 మీటర్ల సింక్రనైజ్డ్‌ టీమ్‌ విభాగంలో ఆ జట్టు రజతం (చెన్‌ అసెన్‌-కావో యున్‌)తో సరిపెట్టుకుంది. చైనాకు షాకిస్తూ టామ్‌ డేలీ-మాట్‌ లీ (బ్రిటన్‌) పసిడి గెలుచుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన