గంటన్నరలో రెండు స్వర్ణాలు

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:42 IST

గంటన్నరలో రెండు స్వర్ణాలు

టోక్యో: ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే ఎంతో గొప్ప. అథ్లెట్లకు అది మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటిది ఈ న్యూజిలాండ్‌ అమ్మాయి గంటన్నరలో ఏకంగా రెండు స్వర్ణాలు కొల్లగొట్టింది. తన పేరు లిసా కేరింగ్టన్‌. మహిళల సింగిల్స్‌ కయాక్‌ 200మీలో విజేతగా నిలిచిన 90 నిమిషాల తర్వాత ఆమె మరో పసిడి పతకాన్ని ముద్దాడింది. కైట్లిన్‌ రీగల్‌తో కలిసి మహిళల 500మీ డబుల్‌ కయాక్‌ ఈవెంట్‌ను గెలుచుకుంది. కేరింగ్టన్‌ 2012, 2016 ఒలింపిక్స్‌లోనూ కయాక్‌ 200మీ లో స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన