వివాదంలో డెన్మార్క్‌ సైక్లింగ్‌ జట్టు

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:45 IST

వివాదంలో డెన్మార్క్‌ సైక్లింగ్‌ జట్టు

ఇజు (జపాన్‌): ఒలింపిక్స్‌లో డెన్మార్క్‌ పర్స్యూట్‌ జట్టు (సైక్లింగ్‌) వివాదాలు సృష్టిస్తూనే ఉంది. ఈ ప్రపంచ ఛాంపియన్‌ జట్టు మొదట సోమవారం క్వాలిఫయింగ్‌ సందర్భంగా కాళ్లపై కినెసియోలజీ టేప్‌, జెర్సీల కింద ఏరోడైనమిక్‌ వెస్ట్‌లు ధరించడం కలకలం రేపింది. అలా ధరించడం నిబంధనలకు సంపూర్ణ విరుద్ధం కాకపోయినా.. అందులోని లొసుగులను అడ్డంపెట్టుకుని వారు లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మంగళవారం హీట్లో డెన్మార్క్‌ ఆధిక్యంలో ఉన్నప్పుడు ఆ జట్టులో ముందున్న రైడర్‌.. ప్రధాన ప్రత్యర్థి బ్రిటిష్‌ జట్టులో అందరికన్నా వెనకున్న రైడర్‌ను ఢీకొట్టాడు. అయినా అధికారులు డెన్మార్క్‌ను ఫైనల్‌కు పంపారు. మరోవైపు టేపుల వాడకానికి సంబంధించి డెన్మార్క్‌పై బ్రిటన్‌ సహా అనేక దేశాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రపంచ సైక్లింగ్‌ సంఘం స్పందించింది. డెన్మార్క్‌ను హెచ్చరించింది. ఇకపై టేపులు వాడొద్దని స్పష్టం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన