రవి, దీపక్‌కు మెరుగైన డ్రా

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:45 IST

రవి, దీపక్‌కు మెరుగైన డ్రా

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు రవి దహియా, దీపక్‌ పునియాలకు మెరుగైన డ్రా లభించింది. రవి (57కేజీ).. కొలంబియాకు చెందిన టైగ్రెరోస్‌ అర్బానోతో పోరుతో తన స్వర్ణ వేటను ఆరంభిస్తాడు. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే రవి పెద్దగా శ్రమపడకుండానే సెమీఫైనల్‌ చేరే అవకాశముంది. సెమీస్‌లో అతడికి టాప్‌ సీడ్‌ స్తెవాన్‌ ఆండ్రియా మిచిచ్‌ (సెర్బియా) లేదా యుకి తకహషి (జపాన్‌) ఎదురయ్యే అవకాశముంది. ఇక దీపక్‌ (86కేజీ) తొలి రౌండ్లో నైజీరియా రెజ్లర్‌ అగియోమోర్‌ను ఢీకొంటాడు. మరోవైపు 19 ఏళ్ల అన్షు మలిక్‌ (57కేజీ)కు కఠినమైన డ్రా పడింది. మహిళల తొలి రౌండ్లో ఆమె ఐరోపా ఛాంపియన్‌ ఇరినా కురచికినాతో తలపడాల్సివుంది. ఆమెపై గెలిస్తే తర్వాతి రౌండ్లో రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత వలేరియా కొబొలోవా (రష్యా) ఎదురుకావొచ్చు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన