నిరీక్షణ ముగిసేనా?

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:33 IST

నిరీక్షణ ముగిసేనా?

హాకీ కాంస్య పోరులో నేడు జర్మనీతో భారత్‌ ఢీ

టోక్యో: ఒలింపిక్స్‌ హాకీలో భారత పురుషుల జట్టుది ఘనమైన చరిత్ర. గతంలో ఏకంగా ఎనిమిది స్వర్ణాలు దక్కించుకుంది. కానీ 1980 క్రీడల తర్వాత మన ప్రదర్శన పడిపోతూ వస్తోంది. 41 ఏళ్లలో ఒక్క పతకం కూడా దక్కలేదు. ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలికే అవకాశం వచ్చింది. గురువారం కాంస్య పతక పోరులో భారత్‌.. జర్మనీతో తలపడుతుంది. మంచి అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన భారత్‌.. సెమీస్‌ వరకూ మంచి ప్రదర్శనే చేసింది. కానీ సెమీస్‌లో ప్రపంచ ఛాంపియన్‌ బెల్జియం చేతిలో ఓడింది. ఆ మ్యాచ్‌ పొరపాట్లను సరిదిద్దుకుని.. డిఫెన్స్‌ను మెరుగుపర్చుకుంటేనే పతకం దక్కుతుంది. రియోలో కాంస్యం గెలిచిన జర్మనీని తక్కువ అంచనా వేయలేం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన