ఆ అయిదు.. అందేనా?

ప్రధానాంశాలు

Published : 05/08/2021 02:48 IST

ఆ అయిదు.. అందేనా?

పతక పోటీల తొలిరోజే భారత్‌కు మీరాబాయి చాను రజతం అందించింది. బ్యాడ్మింటన్‌లో సింధు, బాక్సింగ్‌లో లవ్లీనా కాంస్యాలు పట్టుకొచ్చారు. రెజ్లింగ్‌లో ఫైనల్‌ చేరిన రవి పతకం ఖాయం చేశాడు. పతకాల సంఖ్యలో రియో (2)ను దాటేసిన భారత్‌ను ఇప్పుడు మరో అయిదు పతకాలు ఊరిస్తున్నాయి. ఒలింపిక్స్‌ చివరి దశకు వచ్చే కొద్దీ పతక ఆశలు చిగురిస్తున్నాయి.


ఇటు అబ్బాయిలు..

1980 తర్వాత హాకీలో తొలిసారి భారత పురుషుల జట్టు పతకంతో తిరిగొచ్చేలా కనిపిస్తోంది. సెమీస్‌లో ఓడిన భారత్‌.. కాంస్య పతకం కోసం గురువారం జర్మనీతో తలపడుతుంది.


అటు అమ్మాయిలు..

సెమీస్‌ చేరి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు.. అర్జెంటీనా చేతిలో ఓడి పసిడి పోరుకు దూరమైంది. కాంస్యం కోసం శుక్రవారం బ్రిటన్‌తో అమ్మాయిలు పోటీపడనున్నారు.


పట్టు పట్టేనా..

రెజ్లింగ్‌ పురుషుల 86 కేజీల విభాగంలో దీపక్‌ గురువారం కాంస్య పోరులో బరిలో దిగనున్నాడు. గొప్పగా పోరాడిన అతడు సెమీస్‌లో ఓడిపోయాడు.


అన్షుకు అవకాశం

మహిళల రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో తొలి రౌండ్లోనే ఓడిన అన్షుకు గురువారం కాంస్యం కోసం పోరాడే అవకాశం దక్కింది. ఆమెను ఓడించిన రెజ్లర్‌ ఫైనల్‌ చేరడంతో తనకు రెపిచేజ్‌లో ఈ ఛాన్స్‌ వచ్చింది.


ఈటె జోరు..

కచ్చితంగా పతకం సాధిస్తాడనే అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన భారత జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా.. ఆ దిశగా అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. శనివారం ఫైనల్లో పోటీపడనున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన