కాంస్యం ఆరంభం మాత్రమే: షంషేర్‌

ప్రధానాంశాలు

Published : 15/09/2021 01:09 IST

కాంస్యం ఆరంభం మాత్రమే: షంషేర్‌

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలవడం కేవలం ఆరంభం మాత్రమేనని.. ప్రపంచ నంబర్‌వన్‌ జట్టుగా ఎదగడమే తమ లక్ష్యమని భారత హకీ జట్టు ఫార్వర్డ్‌ షంషేర్‌ సింగ్‌ చెప్పాడు. ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జట్టు పతకం గెలిచిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘జట్టుగా మేమింకా చాలా లక్ష్యాలు సాధించాల్సి ఉంది. ఒలింపిక్‌ పతకం గెలవడం ద్వారా ఒక లక్ష్యాన్ని చేరుకున్నాం. కానీ కొన్నేళ్లలో ప్రపంచ నంబర్‌వన్‌ జట్టుగా ఎదగాలన్నదే మా ప్రయత్నం. ఇందుకోసం భవిష్యత్‌లో మేం ఆడబోయే ప్రతి మ్యాచ్‌లో వందశాతం కష్టపడతాం. ముఖ్యంగా ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌ లాంటి టోర్నీల్లో సత్తా చాటాల్సి ఉంది. మ్యాచ్‌ మ్యాచ్‌కు పరిణతి సాధిస్తామనే నమ్మకముంది’’ అని షంషేర్‌ చెప్పాడు. ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు అతడు తెలిపాడు. జర్మనీతో కాంస్య పోరులో వెనకబడినా కూడా గెలవగలమన్న విశ్వాసాన్ని కోల్పోలేదని షంషేర్‌ పేర్కొన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన